డ్ర‌గ్స్ రాకెట్ పై స్పందించిన న‌టీన‌టులు, ఎవరెవరు.. ఏమేం అన్నారంటే…

హైదరాబాద్: రెండు రోజులుగా టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ డ్ర‌గ్స్ రాకెట్ ఉదంతం అటు ఇండ‌స్ట్రీ ఇటు సినీ ల‌వ‌ర్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పేరు మోసిన డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ మొబైల్ డాటా ఆధారంగా టాలీవుడ్ సెలబ్రిటీల సమాచారం తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు: 12 మంది సినీ ప్రముఖులు, అరెస్టు అంశంపై ఇప్పుడే చెప్పలేం: అకున్ సబర్వాల్ డ్రగ్స్.. డ్రగ్స్: అయ్యో.. వీళ్లకేమైంది? పూరీ వర్గాన్నే టార్గెట్ చేశారా? ఇందులో పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరో న‌వదీప్, నందు, త‌నీష్‌, ఛార్మి, ముమైత్ ఖాన్, కెమెరామెన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరాజు ఉన్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ సెల‌బ్రిటీల‌కి ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటోసులు పంపార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వ్య‌వ‌హారంలో త‌మ పేరు అన‌వ‌స‌రంగా ఇరికించార‌ని కొంద‌రు, విచార‌ణకి వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకుంటామ‌ని మ‌రి కొంద‌రు చెబుతున్నారు. డ్ర‌గ్స్ రాకెట్ వ్య‌వ‌హ‌రంలో ఇరుకున్న ఒక్కొక్క‌రు.. ఏమేం అన్నారంటే..

తప్పు చేయలేదు.. భయపడేది లేదు: హీరో న‌వ‌దీప్
Drug Notice
Drug Notice

త‌న‌కి ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నుండి నోటీసు అందినట్లు హీరో నవదీప్ తెలిపారు. అయితే తానెప్పుడూ ఎలాంటి త‌ప్పు చేయలేదని, అన‌వ‌స‌రంగా తనపై లేని పోని ప్ర‌చారాలు చేస్తున్నారని పేర్కొన్నాడు. కెల్విన్ అనే వ్య‌క్తి ఎవ‌రో కూడా తనకు తెలియ‌దని, ఇటీవ‌ల ఓ రాంగ్ ఈవెంట్ వారితో క‌లిసి ప‌ని చేయ‌డం జరిగిందని, తన నెంబ‌ర్ వారి దగ్గ‌ర ఉండ‌డం వల్లే తననూ విచార‌ణ‌కు పిలిచారని తెలిపాడు. విచార‌ణ‌లో సిట్ అధికారులకు స‌హ‌క‌రిస్తాన‌ని న‌వ‌దీప్ అన్నాడు. గ‌తంలో త‌నపై వ‌చ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ విష‌యాలు కూడా స‌రిదిద్దుకున్నట్టు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు.

అసలవి ఎలా ఉంటాయో కూడా తెలీదు: నటుడు నందు
Drug Notice
Drug Notice

త‌న జీవితంలో ఎన్నడూ డ్ర‌గ్స్ చూడ‌లేద‌ని, డ్ర‌గ్స్ తీసుకునే అల‌వాటు త‌న‌కు లేద‌ని ప్ర‌ముఖ సింగ‌ర్ భ‌ర్త నందు అన్నాడు. డ్రగ్స్ విషయంలో తన భర్త పేరు రావడాన్ని ఆ సింగ‌ర్ కూడా ఖండించింది. త‌న భ‌ర్త‌కు అలాంటి అల‌వాట్లు లేవ‌ని పేర్కొంది. అయితే విచార‌ణ‌లో ఏ ప‌రీక్ష‌కైనా తాను సిద్ధ‌మేన‌ని నందు అన్నాడు. దీనిపై పూర్తి విచార‌ణ జ‌రిపి, అస‌లు విష‌యాన్ని మీడియా వెలుగులోకి తేవాల‌ని ఈ యువ న‌టుడు అంటున్నాడు.

మీడియాలో నా పేరు రావడం బాధ కలిగిస్తోంది: హీరో తనీష్
Drug Notice
Drug Notice

డ్రగ్స్ కేసులో త‌న పేరు రావడంపై యువ హీరో త‌నీష్ విచార‌ణ వ్య‌క్తం చేశాడు. డ్ర‌గ్స్ తీసుకునే జాబితాలో త‌న పేరు ఉండ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మీడియాలో వ‌స్తున్న వార్త‌లు త‌న కుటుంబ సభ్యుల‌ని తీవ్ర ఆందోళ‌నకు గురి చేస్తున్నాయ‌ని అన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు నోటీసులు అంద‌లేదు, అధికారులు పిలిస్తే త‌ప్ప‌క విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని త‌నీష్ అన్నాడు.

నేను ఇంగ్లీష్ మెడిసినే వాడను, ఇవెందుకు వాడతాను: సుబ్బరాజు
Drug Notice
Drug Notice

తాను ఇంత వ‌ర‌కు ఇంగ్లీష్ మెడిసినే వాడ‌లేద‌ని, అలాంటింది డ్ర‌గ్స్ ఎందుకు వాడ‌తాన‌ని సపోర్టింగ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు వ్యాఖ్యానించాడు. ఈ కేసు విష‌యంలో పోలీస్ అధికారి వచ్చి నోటీసులు ఇవ్వ‌డంతో షాక్ అయ్యాన‌ని, ఇందులో ఆరేడు ర‌కాల డ్ర‌గ్స్ పేర్లున్నాయ‌ని సుబ్బ‌రాజు తెలిపాడు. తనకు తెలిసినంత వరకు ఈ జాబితాలో ఎవరూ డ్రగ్స్ తీసుకోరని సుబ్బరాజు అన్నాడు. ఆరోగ్యం పట్ల తానెంత శ్రద్ధ తీసుకుంటానో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, డ్ర‌గ్స్ తో వచ్చే ఎక్స్ ట్రా ఆనందం త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ఇప్పుడు తాను సంతోషంగానే ఉన్నానని తెలిపాడు. వ్య‌వ‌స్థ‌కి వ్య‌తిరేకంగా ఉండ‌నని, త‌ప్ప‌క విచార‌ణ‌కి హాజ‌రు అవుతానని తెలిపాడు.

నేనెలాంటి తప్పూ చేయలేదు: ఛార్మీ
Drug Notice
Drug Notice
ఇక ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ త‌నెలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ఇండైరెక్ట్ గా సోష‌ల్ మీడియా లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో “నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేసి చిన్నబుచ్చినా.. నువ్వేమీ బాధ పడాల్సిన‌ అవసరం లేదు. వాళ్ళు అలా చేస్తున్నారంటే అది కేవలం నీ దైర్యాన్ని దెబ్బ తీయడానికే. నువ్వు వాళ్ళ కన్నా గొప్పగా ఆలోచిస్తే నిన్ను ఎలా అవమానపరుస్తారు..” అంటూ ఓ మెసేజ్ పెట్టింది. అంటే ఛార్మి తనను తాను నిర్ధోషిగా నిరూపించుకునేందుకే ఈ పోస్ట్ పెట్టిందా? అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
మీడియాలోనే కనపడను.. అలాంటిది నాపై: కెమెరామెన్‌ శ్యామ్‌ కె నాయుడు
Drug Notice
Drug Notice

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్‌ శ్యామ్‌ కె నాయుడు అన్నాడు. మీడియాలో ఎక్కువ‌గా క‌నిపించ‌ని తనపై ఇలాంటి వార్త రావ‌డం బాధ‌గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌చారం వ‌ల‌న త‌న కుటుంబ స‌భ్యులు చాలా బాధ ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *