బిగ్ బాస్ లోకి ఇతను కూడా వస్తున్నాడా

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో రేటింగ్స్ నిలబెట్టుకోవడానికి స్టార్ మా ఛానల్ పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. తారక్ వచ్చే రెండు రోజులు తప్ప మిగిలిన రోజులు రేటింగ్స్ అంతకంతకు పడిపోవడమే తప్ప హైప్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే దీక్షా పంత్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో షో లోకి తీసుకొస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర అల్లరి, ప్రిన్స్ ముద్దులు పెట్టడం లాంటివి ఎంతో కొంత హెల్ప్ అయ్యాయి.

big boss
big boss

ఎలిమినేషన్ కూడా జరుగుతూ ఉండటంతో ఉన్నవాళ్ళను చూడలేక ప్రేక్షకులు చానల్స్ మారుస్తున్నారు. అందుకే కొత్తదనం యాడ్ చేయడానికి నవదీప్ ని రంగంలోకి దించబోతున్నారని తెలిసింది. దీక్ష పంత్ లాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Related: bollywood actress without makeup

 నవదీప్ నిన్న రిలీజ్ అయిన నేనే రాజు నేనే మంత్రి రానా అనుచరుడిగా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. లాస్ట్ ఇయర్ ధృవ తర్వాత నవదీప్ కు పేరు తెచ్చే పాత్ర ఇదే. డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా విచారణ ఎదుర్కున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ తో కలిసి అల్లరి చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో డ్రగ్స్ కేస్ అనుమానితురాలు ముమైత్ ఖాన్ ఇప్పటికే షో లో ఉండగా నవదీప్ కూడా తోడవుతున్నాడు.

నవదీప్ కు రియాలిటీ షోస్ లో యాంకర్ గా చేసిన అనుభవం ఉంది. షోని రసవత్తరంగా మార్చగలిగే టాలెంట్ ఉంది. తప్పుకుండా మిగిలినవాళ్ళలో కూడా ఎనర్జీ నింపి కొంచెం బూస్ట్ ఇస్తాడని ఆశపడుతున్నారు స్టార్ మా నిర్వాహకులు. మరి నవదీప్ వచ్చి వాళ్ళ కోరిక నెరవేరుస్తాడో లేదో చూద్దాం.

Related: tv actress without makeup

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *